నమస్తే తెలంగాణ దినపత్రిక 23/06/2025
సాహిత్య గ్రంథాల దిక్సూచి...
తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టిన అనేక ప్రాజెక్టులలో 'తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి' నిర్మాణం ఒక బృహత్కార్యక్రమం. ఇలాంటి సాహితీ ప్రాజెక్టులకు ప్రధానంగా విషయ సేకరణ ఒక యజ్ఞం లాంటిది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యపరంగా తన అస్తిత్వాన్ని, మూలాలను పలు పార్శ్వాల నుంచి అన్వేషించుకుంటూ మరుగున పడిన వైభవాన్ని పునర్నిర్మాణం చేసుకునే దిశగా సాగుతున్నది. తన వంతు బాధ్యతగా తెలంగాణలోని మేధావుల, కవుల, రచయితల, సాహితీవేత్తల సృజనలను బయటి ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరాన్ని సాహిత్య అకాడమీ గుర్తించి 'తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి'ని తీసుకురావాలనే ఆలోచన చేసింది. అప్పటి అకాడమీ తొలి అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, తొలి కార్యదర్శి డా. ఏనుగు నరసింహారెడ్డి వారి నిర్ణయాత్మకమైన ఆలోచనను సాకారం చేస్తూ అట్టెం దత్తయ్య ప్రధాన సంపాదకత్వంలో, సహ సంపాద కులు డాక్టర్ యెల్చాల నర్సింలు, డాక్టర్ మ్యాతరి ఆనంద్, వర్ధ వేణుల సహకారంతో ఈ గ్రంథ సూచి కార్యక్రమంలో అనేక సమస్యలు ఎదు రైనా విజయవంతంగా పూర్తిచేయడం గొప్ప విషయం. కార్యనిర్వాహక సంపాదకులుగా అకాడమీ కార్యదర్శి డా. నామోజు బాలాచారి వ్యవహరించగా, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు చెప్పినట్టుగా ఈ సూచి ఆధారంగా ఏయే ప్రాంతాల్లో ఎలాంటి స్పందన లభించిందో గమనించవచ్చు. స్థానిక ప్రసిద్ధులను గుర్తించవచ్చు. ఈ సాహిత్య గ్రంథ సూచిలో రచయిత పేరు, గ్రంథం పేరు, ప్రక్రియ, ప్రచురించబడిన సంవత్సరం, పుటలు, వెల, ప్రచురణ సంస్థ ఇత్యాది వివరాలను పట్టిక రూపంలో పొందుపరిచారు. 706 పేజీలలో దాదాపుగా 14,120 పైచిలుకు గ్రంథ వివరాలున్నా యి. అన్నిరకాల సాహిత్య ప్రక్రియలు వచన కవిత, కథలు, పాటలు, శతకాలు, వచనాలు, జీవిత చరిత్రలు, మోనోగ్రాఫ్, నాటకం, గేయాలు, పరిశోధనలు, కావ్యా లు, ఉద్యమ చరిత్రలు, ఆధ్యాత్మిక రచ నలు, యక్షగానం, నవల, యాత్రా చరిత్ర, విమర్శ, అనువాదాలు, వ్యాసాలు, బాల సాహిత్యం ఇంకా ఇతర రచనా ప్రక్రియల విషయాలను సేకరించి ఇచ్చారు. ఈ విషయ సేకరణ వాటి ప్రచురణ ద్వారా తెలంగాణ ప్రాంతంలో వెలుగు చూడని అన్ని సాహిత్య ప్రక్రియలలోని సాహిత్య గ్రంథాలను ఒకచోట చేర్చి సాహితీ ప్రపంచానికి అందజేసే అవకాశం లభించింది.
ఒక జాతి బహుముఖీనమైన సమగ్రాభివృ ద్ధిలో సంస్కృతి, సాహిత్యాలది ప్రముఖ స్థానం. భాషా సాహిత్యాలు ఒక జాతి వికాసానికి ముఖ్యాంగాలనడం అతిశయోక్తి కాదు. వర్త మాన తరానికి దిశానిర్దేశం చేసేవిధంగా అనేకమైన విశేష సాహితీ కార్యక్రమాలు చేపట్టడమే గాక అరుదైన గ్రంథాలను ప్రచురించి అందుబాటులో ఉంచుతూ ముందుచూపుతో అనేక సాహితీ ప్రాజెక్టులను కూడా భవిష్యత్తు ప్రణాళికలుగా వేసి నడిపించిన సాహిత్య అకాడమీ తొలి అధ్య క్షులు నందిని సిధారెడ్డి నిబద్ధత, ముందుచూపు హర్షించదగినది. వారి బాటలోనే నడుస్తూ ఈ బృహత్ ప్రయత్నాన్ని నడిపించిన డాక్టర్ నామోజు బాలాచారికి, బాధ్యతలను భుజానికెత్తుకొని కార్యాన్ని సాధించినందుకు ప్రధాన సంపాదకులు అట్టెం దత్తయ్య బృందానికి అభినందనలు.
డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్
నమస్తే తెలంగాణ దినపత్రిక 23/06/2025
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా అస్తిత్వ మూలాలను వెలికితీసారు మేధావులు, ఉద్యమకారులు. ఎందరో వీరుల ఆత్మ బలిదానాలు త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దశాబ్దాలుగా మూలపడిన "సాహిత్య అకాడమి" మళ్ళీ ఆవిర్భవించి తొలి అధ్యక్ష కార్యదర్శులుగా డా. నందిని సిధారెడ్డి, డా. ఏనుగు నరసింహారెడ్డి గార్ల నియామకం వారి ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, ఎన్నో విలువైన ప్రాచీన గ్రంథాల ముద్రణలు జరిగాయి. ఆ పరంపరలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో మరుగున పడిన అన్ని ప్రక్రియల్లోని సాహిత్య గ్రంథాలను అన్నింటిని వెలికితీసి వాటిని ఓ క్రమ పద్ధతిలో తయారు చేసి ప్రచురించడం ద్వారా కొత్త పరిశోధకులకు, కొత్త ప్రతిపాదనలకు అవకాశం ఏర్పడుతుందని భావించి, అందుకోసం ఓ బృహత్తర గ్రంథ సూచి తేవాలన్న అకాడమి ఆలోచనలో జనించిందే “ఈ తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి". 2019 నాటి ఈ గ్రంథ ప్రాజెక్టును కేవలం 2020 నాటికే పూర్తిచేసిన డా. అట్టెం దత్తయ్య, డా. యెల్చాల నర్శింలు, డా. మ్యాతరి ఆనంద్, డా.వర్ధ వేణు గారల కృషి మిక్కిలి శ్లాఘనీయం. అద్భుత ముఖ చిత్రం అందించిన అశోక్ చారీ అభినందనీయులు, దాదాపు 12 వేల గ్రంథాలు - వాటి రచయితలు “సాహిత్య గ్రంథ సూచి"గా ఇది వెలువడింది. 2019 తర్వాత వచ్చిన రచనల్ని దీనిలో పొందుపర్చతామన్న నిర్వాహకుల నిజాయితీకీ కృతజ్ఞతలు. ఇంత గొప్ప సాహిత్య గ్రంథ సూచీకి శ్రీకారం చుట్టిన సిధారెడ్డి, నరసింహారెడ్డి గార్లకు, పర్యవేక్షకులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు గారికి (నేటి వి.సి. తెలుగు విశ్వవిద్యాలయం) ఆకృతి దాల్చడానికి ఆర్థిక వనరులు సమకూర్చిన కార్యదర్శి బాలాచారి గారికి - సంపాదకులు వారి సహాయ సంపాదక బృందానికి కృతజ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే. విద్యార్థులకు, సాహిత్యకారులకు, సాహిత్య అభిమానులకు, పరిశోధకులకు, పాత్రికేయులకు, సమగ్ర సాహిత్య అధ్యయనకారులకు, శోధకులకు, సాధకులకు, పోటీ పరీక్షలు రాసే ఉద్యోగార్థులకు, అధ్యాపకులకు, కవులకు, రచయితలకు, జానపద వాఙ్మయ కారకులకు, కళాకారులకు తప్పనిసరిగా ఉండాల్సిన బృహత్ కరదీపిక ఈ "తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి". తెలుగు ముద్రణ 1811లో ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో గ్రంథ సూచీలు వచ్చాయి. గతంలో సి.పి. బ్రౌన్ ఆంధ్ర గ్రంథముల పట్టి, గీర్వాణ గ్రంథముల పట్టి, అనే రెండు చిన్న “సూచీ" పుస్తకాన్ని 1848 నాటికే తయారుచేసుకున్నాడు. దానిలో పుస్తకాల జాబితానే వుంది - కవుల గురించి లేదు A Catalogue of the Telugu Books in the Libraray of the British Museum అన్న పేరుతో 1912లో తెలుగుకు సంబంధించిన ఒక గ్రంథం ముద్రించారు దీని సంకలనకర్త L.D. Barnett. 1929లో "ఆంధ్ర వాఙ్మయ సూచిక" ముద్రితా ముద్రిత గ్రంథాల పట్టికను ఆంధ్ర పత్రిక అధినేత కాశీనాథుని నాగేశ్వరరావు తెచ్చారు. అంతకు ముందే కందుకూరి "ఆంధ్ర కవుల(సంగ్రహం)” “చరిత్ర” తెచ్చారు. లభ్య ముద్రిత తెలుగు పుస్తకాలలో తొలిగ్రంథం "శబ్దమంజరి" (1827) దీనిలో 1827 2 1927 5 (1002) 12,800 గ్రంథాల వివరాలున్నాయి. 1932లో ఎస్. కుప్పుస్వామి "తెలుగు రాత ప్రతుల ఆకారాది సూచి" అందించారు. 3,870, గ్రంథాల పట్టిక వుంటుంది (తాళపత్ర కాగిత ప్రతులు). వెలగా వెంకటప్పయ్య 1863 1965 దాకా గల సాహిత్య సూచిగా "శాస్త్రీయ వాఙ్మయ సూచి” వెలువరించారు.
కరణం రంగనాథరావు “భారతీయ గ్రంథ సూచి" 1975లో వెలువరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి "వ్యాస రచనల సూచి" 1977లో వెలువరించారు. తెలగు అకాడమి "తెలుగు సాహిత్య కోశము" 1980లో ప్రచురించింది. (ఇందులో 1851 దాకా వచ్చిన గ్రంథాలే వున్నాయి). డా. జి.యస్.మోహన్ "తెలుగు జానపద విజ్ఞాన సూచి" 1982లో వెలువరించారు. ఉ మ్మడి ఏపీలో నాటి సాహిత్య అకాడమి 1984లో "తెలుగు రచయితల రచనలు" ప్రచురించారు. (దాదాపు ఆరువేల మంది రచయితల రచనలున్నాయి 1875 19800 ລ້ రచయితలు). వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ జీవిత సూచికను డా.టి. శ్రీ రంగస్వామి 1900 సంవత్సరానికి ముందు గల 101 మంది రచయితల వివరాలతో ప్రచురించారు. నీలగిరి కవుల సంచిక - భారతి సూచి, తాళపత్ర గీతము (2009) లాంటివి ఎన్నో వచ్చాయి. 109 మంది ఆంధ్ర రచయితలు గ్రంథాన్ని మధునాపంతుల సత్య నారాయణ శాస్త్రి వెలువరించారు. దాదాపు 2110 కథా రచయితల కథలు, వివరాలతో తెలుగు అకాడమి కాళీపట్నం రామారావు గారి సంపాదకత్వంలో "తెలుగు కథాకోశం" 2005లో ప్రచురించారు. కవిత్వ కోశం కూడా నాటి ప్రాజెక్టులో వుంది.!
తెలుగు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం “నాటక విజ్ఞాన సర్వస్వం” 2008లో ప్రచురించింది. ఇది ప్రపంచ నాటక రంగానికి సంబంధించిన చాలా విలువైన గ్రంథం. కోలాచలం శ్రీనివాసరావు ప్రపంచ నాటక చరిత్ర రాసారు. ఇటీవల కె.ఆనందాచారి సంపాదకత్వంలో "తెలుగెత్తి జై కొట్టు" అనే రగంథాన్ని 135 మంది కవుల చరిత్రతో 800 పేజీల బృహత్ గ్రంథాన్ని 2019లో తెచ్చారు. దీన్ని తెలంగాణ సాహితి సంస్థ ప్రచురించింది. ఇదే సంస్థ "సినీ గీతావరణం" పేరుతో 138 సినీ పాటల రచయితల పుస్తకం తెచ్చారు.
తెలంగాణ సాహిత్య ప్రస్థానాన్ని గొప్పగా తెలిపే సురవరం "గోల్కొండ కవుల సంచిక" 1956 సం|| ముందునాటి కథకులతో ముద్రణ అయిన డా॥ సంగిశెట్టి శ్రీనివాస్ “దస్త్రమ్” ఇంకా జిల్లా స్థాయిల్లో చాలా మంది సాహిత్య సాంస్కృతిక రంగ ప్రేమికులు “జిల్లా” స్థాయిలో తెచ్చిన సంచికలు ఉన్నాయి. ఇక ఈ తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి ప్రత్యేకతలు ఏమిటో క్లుప్తంగా పరిశీలిద్దాం
1) 2019 సం॥ వరకు వెలువడిన గ్రంథాలున్నాయి.
2) అకారాది క్రమంలో ప్రచురణ.
3) ఇక్కడే స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంత కవులూ రచయితల గురించి వుంది.
4) రచయిత - రాసిన పుస్తకం - ప్రక్రియ ఏ సం||లో ప్రచురణ - పేజీలు ప్రచురణ సంస్థ పేరు. వెల
5) విలువైన సమాచార దర్పణంగా ఈ సూచీ గ్రంథం వుంది. ఉదాహరణకు అనంతయ్య పటేలుగారు 1989లో రాసిన విలువైన గ్రంథం - తెలుగు వైతాళికులు "ముఖుం మొహియుద్దీన్" జీవిత చరిత్ర - 68 పేజీలు 20 రూపాయలు తెలుగు విశ్వవిద్యాలయం ముద్రణ.
అలాగే కమ్యూనిస్ట్ ఉద్యమ తొలితరం వ్యక్తి జి. అధికారి వారు రాసిన జాతీయ విప్లవకారులు గ్రంథం 1987లో విశాలాంధ్ర ఆ సంస్థ ఎన్నో వేల వారు ప్రచురించారు. గ్రంథాలు ముద్రించింది కాని అధికారి రాసిన ఈ పుస్తకం ఎంతో విలువైంది. (ఈ గ్రంథ సూచీలో 7వ పేజి.)
హరిశ్చంద్ర నాటకం అనగానే బలిజేపల్లి వారి నాటకమే గుర్తువస్తుంది. కాని 'అనంతయ్య' రాసిన 'హరిశ్చంద్ర' గురించి ఈ సూచి చెపుతుంది. కేవలం 22 పేజీలే ఉండొచ్చు కాని కొండాపురం అనంతాచార్యులు 1978లో రాసిన శ్రీ క్షీరాద్రి లక్ష్మీనృసింహ శతకం సొంతంగా కవి గారే ప్రచురించారు. ఈ సమాచారం (పేజి-9) ఈ నూచీలో దొరుకుతుంది.
జయధీర్ తిరుమల రావు 1988లో తెలంగాణ రైతాంగ పోరాట ప్రజాసాహిత్యం పరిశోధించి రాసారు. వారి రచనలు కొన్ని (157 పేజీలో) చూడగలం. అలీ నయ్యద్ నాటకాల గురించి పేజి.19లో ఇచ్చారు - ప్రచురణ సం|| పేజీలు వెల - ప్రచురణ సంస్థ - లభ్యత వివరాలు ఇస్తే బాగుండేది.
తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ సాహితి మానేరు రచయితల సంగం తెలంగాణ రచయితల సంఘం పాలపిట్ట శ్రీ విద్యాసాహిత్య సంస్థానం - నిజామాబాద్ విశాల సాహిత్య అకాడమి స్పృహ సాహితి సంస్థ, సిరిసిల్ల సాహితి యువ రచయిత సమితి - మాతృవత్సల ప్రచురణలు - (హైదరాబాద్) -తెలంగాణ విద్యావంతుల వేదిక రామయ్య విద్యా పీఠం - నవ్య సాహిత్య పరిషత్ స్వామి రామానంద తీర్త స్మారక సంఘం జాతీయ సాహిత్య పరిషత్ - లేఖిని దేశోద్దారక గ్రంథమాల - హైదరాబాద్ ఫిలిం క్లబ్ - పొయెట్రీ ఫోరం సాహితీ స్రవంతి, తెలంగాణ సాహితి, సాహితీ గౌతమి, అన్వేషణ ప్రచురణ, ఝులీ పోయిత్రే సర్కిల్, దళిత విద్యా పరిశోధన అభివృద్ధి సంస్థ HBT ఉట్నూరు సాహితీ వేదిక శ్రీకృష్ణ దేవరయాంధ్ర భాషా నిలయం పాలమూరు అధ్యయన వేదిక - ఇందూర్ భారతి తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, - ప్ర.ర.వే., ఎమెస్కో బుక్య, ప్రజాశక్తి, దళిత రీసెర్చ్ సెంటర్ - యువభారతి - పర్ స్పెక్టీ ల్స్- కాళోజీ ఫౌండేషన్ సహృదయ (వరంగల్), దాచేపల్లి కిష్టయ్య, నవచేతన వరసం- అరసం- విశ్వనాథ సాహిత్య పీఠం అడుగుజాడలు శిక్షక్ ప్రచురణలు, మంజీరా రచయితల సంఘం బాల సరస్వతీ బుక్ డిపో, పికాక్ క్లాసిక్స్, జనమిత్ర సాహితీ లే,ష,ల, అనేక పబ్లికేషన్స్, తెలంగాణ ఆత్మగౌరవ వేదిక విశ్వసాహితీ తిరుమల తిరుపతి దేవస్థానం తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం- సాహిత్య అకాడమి, ఎన్బిటీ (నేషనల్ బుక్ ట్రస్ట్) సమాంతర తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి - సాహితీ సోపతి- తేజా పబ్లికేషన్స్ భారతి ప్రచరుణలు ప్రాచ్య లిఖిత గ్రంథాలయం - సాహితీ సర్కిల్, తెలంగాణ సారస్వత పరిషత్ - నీల్ కమల్, నేటి నిజం ప్రచురణలు, సరస్వతి యజ్ఞ సేవాసమితి సాహిత్యనికేతన్ – కాకతి, త్రిలింగ, మూసీ ప్రచురణలు, శ్రీ వేద భారతి తెలంగాణ గ్రంథమాల – మెతుకుసీమ సాహితి వావిళ్ళ శాస్త్రులు సన్స్, నవ్య సాహితీ విశ్వసాహితీ భూమి బుక్ ట్రస్ట్, అరుణోదయ- జన సాహితీ దృష్టి, గుంపు అసధుని మనస్విని-ధర్మకేతనం సాహిత్య పీఠం ఇలా వందలాది పుస్తక ప్రచురణ సంస్థలు - (పబ్లికేషన్) తెలంగాణలో వందేళ్ల క్రిందటి నుండి వున్నాయనే విషయం సాహిత్యకారులు తెల్సుకోవాలి. ఆంధ్రప్రాంతం నుండి అబిడ్స్‌లో సుల్తాన్‌బజార్‌లో ఉన్న పబ్లికేషన్స్ మాత్రమే కాదు - తెలంగాణలో ఎంతో విస్తృత ప్రచురణ సంస్థలు సాహిత్య సంస్థలు - సాంస్కృతిక సంస్థలు- వాటి విలువైన చారిత్రక కర్తవ్యాలు. తేదీలూ - సంవత్సరాలు-కవులు ఈ విలువైన "సూచిగ్రంథంలో” కనిపిస్తాయి.
1981 - నాటి "గీతాయుధం" - రచన అంజయ్య కందుకూరి గురించి తెలుస్సకొంటాం (పేజి.1) 1987 నాటి “నల్గొండ గ్రామదేవతలు అంజమ్మ మాదిరెడ్డి రచన (పేజి-4); ఆమె రచనే 1950 నాటి ఖమ్మం కొత్తగూడెం జానపద గేయాలు గురించి గమనిస్తాం ఈ సూచీ ద్వారా ఓ గేటి అచ్యుతరామశాస్త్రి “హిమహిలీటిని” (1981) ఆజ్మతుల్లా సయ్యద్ "గుచ్ఛము” అనే ఆధ్మాత్మిక రచన 1962 నాటిది- అతని నాటకం "జాహ్నవి" గురించి తెల్సుకొంటాం (పేజి-6), 1700 సం|| అన్నయ్య తిరుమల బుక్క పట్టణం వారి “రాసోదారం - విరోధ వరూధినీ. ప్రమాదీ రచనలూ (పేజి.11)లో చూస్తాం. అవ్సర్ "ఆధునిక అత్యాధునిక” "వ్యాసాలూ” 1993 నాటిది (పే.13) 1997లో దాసరి అమరేంద్ర యాత్రాచరిత్ర "స్యూటర్పై రో హా తాంగ్ యాత్ర" చూస్తాం. 1956 నాటి ప్రచురణైన వట్టికోట ఆళ్వాస్స్వామి వ్యాసాలు గంగు, ప్రభాస, పరిసరాలూ చూస్తాం. (పేజి.28). దున్న ఇద్దాసు తత్వాలు గీతాలు (పేజి. 30లో) ఇస్మాయిల్ కప్పల నిశ్శబ్ధం హైక. ఈదారెడ్డి వెన్నవరం చలంనవల్లు పరిశోధన చూస్తాం. కాత్యాయని “ప్రాచీన సాహిత్యం (పే.47) వ్యూడలిజం మల్లొచ్చింది. కంచ ఐలయ్య రచన, 2019 నాటి ప్రచురణైన ఎల్లారెడ్డి పొద్దుటూరి తెలంగాణ మహిళ (పేజి. 39)లో చూడగలం.
ఈ గ్రంథ సూచిలో ఎందరో కవుల రచనలు వారి ఉద్యమ - కార్యశీలత కావ్యశీలత విపులంగా తెల్సుకోవడానికి ఎంతో ప్రయోజనకారి, ఆధార ఆకార ఉపయుక్త గ్రంథాల విలువైన సమాచార దర్శినియే ఈ గ్రంథసూచి. ప్రతి ఇంటా వుండాల్సిన గొప్ప గ్రంథం ఇది.
కీ॥శే॥ తంగిరాల చక్రవర్తి